నా మైండ్‌సెట్ ఎలాంటిదో వారికి బాగా తెలుసు.. నోరు అదుపులో పెట్టుకోండి: ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక

by Gantepaka Srikanth |

టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs), పార్టీ ముఖ్య నేతలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

నా మైండ్‌సెట్ ఎలాంటిదో వారికి బాగా తెలుసు.. నోరు అదుపులో పెట్టుకోండి: ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs), పార్టీ ముఖ్య నేతలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో టీడీపీ పార్లమెంటరీ(Parliamentary) పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మార్చి నెలాఖరులోగా నామినేటెడ్ పదవు(Nominated Post)లను భర్తీ చేయాలని సూచించారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు వస్తాయని కుండబద్దలు కొట్టారు. పార్టీ పదవులను మహానాడు(Mahanadu)లోపే పూర్తి చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. అనవసరమైన విషయాలపై మాట్లాడొద్దు అని హెచ్చరించారు.

నా మైండ్ సెట్‌ ఎలా ఉంటుందో సీనియర్ లీడర్లకు బాగా తెలుసు.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్‌(Jagan) కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం మనమీద వేశారు. అప్పుడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయాం. నాడు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ(Intelligence System) కూడా కుట్రలను పసిగట్టలేకపోయింది. తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర కోణం ఉంది. ఆ ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్‌ కోరినా ఇవ్వలేదు అని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Next Story