ఏఐజీ ఆస్పత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-26 12:39:46  IST  )

ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

ఏఐజీ ఆస్పత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital)లో చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna)ను పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఆయన వాకర్ సపోర్టర్ సహాయంతో నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన 111వ చిత్రం (#NBK111) చిత్రీకరణ కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో కాలు జారి పడటంతో బాలకృష్ణ ఎడమ మోకాలికి కండరాల గాయం అయింది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్రయూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో శాస్త్ర చికిత్స నిర్వహించారు.

Next Story