- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన నేరుగా పాల్గొంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన నేరుగా పాల్గొంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆయన కర్నూలులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా సి. క్యాంపు రైతు బజారులో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. అంతేకాకుండా నేడు ఆయన బైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మద్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 5.35 గంటల వరకు టీడీపీ నాయకులతో సమావేశం అవుతారు. తరవాత హైదరాబాద్ కు పయనం అవుతారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అనే ఉద్దేశ్యంతో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంద్ర పథకాన్ని తీసుకువచ్చింది.






