- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM chandrababu: మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పడంటే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (n chandrababu naidu)ఈ నెల 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ (delhi) వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ (pm mpdi), హోం మంత్రి అమిత్ షా (amitsha) సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. తిరిగి అదేరోజు రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.50 నిమిషాలకు విశాఖ నుంచి బయల్దేరి నేరుగా మళ్లీ ఢిల్లీ వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే బసచేస్తారు. 7వ తేదీన అమరావతికి తిరిగి వస్తారు. అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది.






