తిరుపతికి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-22 15:02:22  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం తిరుపతిలో పర్యటించనున్నారు. ..

తిరుపతికి సీఎం చంద్రబాబు.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మంగళవారం తిరుపతి(Tirupati)లో పర్యటించనున్నారు. ‘భారతీయ విజ్ఞాన సమ్మేళన'(Bharatiya Vignana Sammelanam) కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి 29 వరకు జరగనుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత తిరుపతి జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సోమవారమే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి ముగిసేంతవరకూ భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.

Next Story