- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధనం పొదుపుపై సీఎం చర్యలు.. అధికారులకు కీలక ఆదేశాలు
ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles) వినియోగాన్ని పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.
Next Story






