- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
జీఎస్టీ(Gst) సంస్కరణలు గేజ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: జీఎస్టీ(Gst) సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గతంలో రాష్ట్రాలు కూడా రకరకాల ట్యాక్సులు కట్టేవని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలు జీవితాలు మారతాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థతకు జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని చంద్రబాబు తెలిపారు. సంస్కరణలకు తాను ముందుంటానని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధికి కృషి చేస్తే అదే సంపద పెంచుతుందని తెలిపారు. సంపద సృష్టించలేదని వ్యక్తులకు సంక్షేమం ఇచ్చే అర్హత లేదన్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో చాలా సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పారు. వన్ నేషన్.. వన్ విజన్‌తో అడుగులు వేశామన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా దేశం, రాష్ట్రమే తమకు ప్రధానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






