- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓబన్న పోరాటం వీరోచితం: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని సీఎం చంద్రబాబు అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: బ్రిటీష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా ఆయన చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారు. కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారు వడ్డే ఓబన్న. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు నిర్ణయించాం. బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందాం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






