గోదావరి పుష్కరాల నిర్వహణపై CM చంద్రబాబు సమీక్ష

by Ajay Maddhiboyina |

గోదావరి పుష్కరాల నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల‌తో ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వ‌చ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వ‌ర‌కు గోదావ‌రి పుష్క‌రాలు నిర్వహించాల‌ని తెలిపారు.

గోదావరి పుష్కరాల నిర్వహణపై CM చంద్రబాబు సమీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: గోదావరి పుష్కరాల నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల‌తో ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వ‌చ్చే ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వ‌ర‌కు గోదావ‌రి పుష్క‌రాలు నిర్వహించాల‌ని తెలిపారు. ఇందుకోసం గోదావ‌రి ప‌రివాహ‌క జిల్లాల్లో పుష్కారాల ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దేశ విదేశాల నుండి సుమారు 10 కోట్ల మంది భ‌క్తులు స్నానం ఆచ‌రిస్తార‌ని అంచ‌నా వేశారు.

ఈ సమావేశంలో మంత్రులు ఆనం, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స‌మావేశంలో హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే ప్రతి 12ఏళ్లకు ఓసారి గోదావరి పుష్కరాలను నిర్వహిస్తారు. చివరిసారిగా 2015లో నిర్వహించగా బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సందర్భంగా 2027లో నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఈ మహా ఉత్సవం జరగనుంది.

Next Story