రేపు ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు: చంద్రబాబు

by Muthe.Rajitha |

మొంథా తుఫాను మరో గంటలో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతోపాటు.. 100కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

రేపు ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను మరో గంటలో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఏపీలోని అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతోపాటు.. 100కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ వంటి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు సీఎస్‌ విజయానంద్‌ సీఎంకు వివరించారు. రేపు ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు కురవనుండటంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు.

ఈరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో.. గతంలో వచ్చిన తుపానులను అంచనా వేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీరం దాటే కాకినాడ, పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అనిత, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story