బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-05 06:44:14  IST  )

ప్రతి ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రముఖ జాతీయ నాయకుడు మరియు సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబూ జగ్జీవన్‌రామ్(Babu Jagjivanram) జయంతి నిర్వహించుకుంటామనే విషయం తెలిసిందే.

బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రముఖ జాతీయ నాయకుడు మరియు సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబూ జగ్జీవన్‌రామ్(Babu Jagjivanram) జయంతి నిర్వహించుకుంటామనే విషయం తెలిసిందే. 'బాబుజీ' అని ముద్దుగా పిలవబడే ఆయన జీవితం, సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఘన నివాళులర్పించారు.

ఈ క్రమంలో ’’భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా.. ఆ అభ్యుదయ నాయకుని స్మృతికి నివాళులు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూజీ స్ఫూర్తిగా మనందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. బాబూ జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం’’ అని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story