- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనను ఎవరూ మర్చిపోలేరు: సీఎం చంద్రబాబు
సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్(Sir Arthur Cotton) చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. కాటన్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పించారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారని చంద్రబాబు కొనియాడారు.
కాగా సర్ ఆర్దర్ కాటన్ బ్రిటీష్ సైనికాధికారిగా, నీటి పారుదల ఇంజినీరుగా భారత్‌లో పని చేశారు. 1840లో కృష్ణానదిపై ఆనకట్ట సాధ్యమేనని నివేదిక సమర్పించారు. 1846గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్టకు లండను డైరక్టర్ల నుంచి ఆమోదం లభించింది. 1847 ఏప్రిలులో గోదావరినదిపై ఆనకట్ట పనులు ప్రారంభించారు. 1848 కృష్ణానది ఆనకట్ట పునాదుల తవ్వకం పనులపై సలహలిచ్చారు. 1848 కెప్టెను ఆర్‍కు ఆనకట్ట పనులప్పగించి, ఆరోగ్య కారణాలపై ఆస్ట్రేలియా వెళ్లారు. 1850 భారత్ కు తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించింది. 1852 గన్నవరం అక్విడక్టు పనులు ప్రారంభమయ్యాయి. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి అయింది. దీంతో ఆయనను కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకున్నారు.






