పదో తరగతి విద్యార్థిని సూసైడ్.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన టెన్త్ విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

పదో తరగతి విద్యార్థిని సూసైడ్.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన టెన్త్ విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనతో ఎంతో ఉత్సాహంగా మాట్లాడి, కలిసి భోజనం చేసిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల రంపచోడవరంలో జరిగిన మెజా పీటీఎంలో తన సమక్షంలో శివాని ఎంతో ధైర్యంగా మాట్లాడిన క్షణాలను సీఎం గుర్తుచేసుకున్నారు. కుటుంబ కలహాలతో శివాని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతిభావంతురాలైన విద్యార్థిని కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని సీఎం ఆవేదన చెందారు. శివాని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Next Story