నోబెల్ సాధిస్తే రూ.100కోట్లు మీవే.. సీఎం చంద్రబాబు బంపారఫర్

by Ajay Maddhiboyina |

క్వాంటం టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే రూ.100 కోట్లు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

నోబెల్ సాధిస్తే రూ.100కోట్లు మీవే.. సీఎం చంద్రబాబు బంపారఫర్
X

దిశ‌, వెబ్ డెస్క్: క్వాంటం టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే రూ.100 కోట్లు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మన పరిశోధనలు నోబెల్ స్థాయికి చేరుకునేలా క్వాంటం టెక్నాలజీ ఉపయోగపడాలని చెప్పారు. తాను చాలా కాలం క్రితం రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించానని నోబెల్ సాధిస్తే అవి మీవే అని అన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటరింగ్ సెంటర్ తో కూడిన ఎకో సిస్టమ్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు క్వాంటం సైన్స్ లో చాలా మంది నోబెల్ గెలుచుకున్నారని మన రాష్ట్రాంలోని మేధావులు, యువత, విద్యావేత్తలు ఎందుకు ప్రయత్నించకూడదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుండి నోబెల్ బహుమతి సాధించాలని తన కోరిక అని అన్నారు. క్వాంటం టెక్నాలజీలో మొదటి నోబెల్ బహుమతి అమరావతికే రావాలని మిగితావి ఇతర దేశాల్లో రావాలని చెప్పారు. ఇదిలా ఉంటే చంద్రబాబు రాష్ట్రాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమరావతికి పలు కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చారు. నోబెల్ బహిమతి సాధిస్తే ప్రపంచ దేశాలు ఏపీవైపు చూసే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.

Next Story