సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్

by Jakkula.Mamatha |

సీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలన పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిమ్మ రాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదని కారణంగా అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడని ఆరోపించారు. ఆమె బిడ్డలు రోదిస్తున్న సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి అని వైఎస్ జగన్ మండిపడ్డారు. పొలిటికల్‌ గవర్నెన్స్‌, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా.. మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా డిమాండ్‌ చేశారు.

Twitter Link

Next Story