CM Chandrababu:‘ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

టీడీపీ మహానాడు కడప జిల్లాలో మూడు రోజులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

CM Chandrababu:‘ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ మహానాడు కడప జిల్లాలో మూడు రోజులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మహానాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇవాళ(శుక్రవారం) సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కడపలో టీడీపీ మహానాడు అద్భుతంగా జరిగింది. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని అన్నారు. ఈ క్రమంలో సక్సెస్ చేసిన నేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కార్యకర్తలకు నా హాట్సాఫ్. నాయకత్వం సమిష్టిగా పని చేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారు.

మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం. ఏడాదిలో మన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలన నిర్ణయాల పై ప్రజల్లో సానుకూలత ఉంది. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించడం జరిగిందన్నారు.

ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలి. నేను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదే. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలి. వచ్చే నెలలోనే(జూన్) తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని మహానాడు వేదికగా చెప్పడం జరిగిందని సీఎం మరోసారి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story