- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP:సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆ అంశాలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు
ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి(State Development) పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి(State Development) పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేడు(సోమవారం) ఏపీలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల అమలు పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) రేషన్, దీపం-2, ఆర్టీసీ, పంచాయతీ సేవలపై అభిప్రాయాలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవల పై వచ్చె నెల(జూన్) 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు ఉంటుందని సీఎం సూచించారు.
కూటమి ప్రభుత్వం(AP Government) అందించే సేవల పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలని అన్నారు. ప్రజా అభివృద్ధే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. RTCలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపరచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీపం-2 పథకం లబ్ధిదారులకు ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము ఇచ్చే అంశంపై సీఎం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. డేటా అనలటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధన్యమివ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశంలో వెల్లడించారు.






