‘అదే నా జీవిత ఆశయం’.. CM చంద్రబాబు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

వైసీపీ పాలన, మాజీ సీఎం జగన్‌(Jagan)పై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అదే నా జీవిత ఆశయం’.. CM చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ పాలన, మాజీ సీఎం జగన్‌(Jagan)పై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. హంద్రీనీవా ఫేజ్‌-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్‌ స్టేషన్‌లో రెండు మోటార్లను ఆన్‌ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు.. వచ్చాక నరుకుడే నరుకుడు మొదలు పెట్టారు’ అని హాట్ కామెంట్స్ చేవారు. హంద్రీనీవాపై ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారని విమర్శించారు. నదులను అనుసంధానం చేయడమే నా జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్ణాటక, మహారాష్ట్రాలో కురిసిన వర్షాలతో ఆగస్టులో రావాల్సిన వరదలు జూలైలోనే వచ్చాయని అన్నారు. రాయలసీమ(Rayalaseema) గురించి మాట్లాడుతారు.. కానీ, రూ. 2,500 కోట్లు ఖర్చు చేసేందుకు వారికి మనసు రాలేదని తెలిపారు. ప్రాజెక్టులను వైసీపీ చెరబట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story