సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు అంటే నా వల్లే: సీఎం చంద్రబాబు

by Gantepaka Srikanth |

కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.

సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు అంటే నా వల్లే: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. వితండవాదం చేయడంలో వైసీపీ ముందుంటుందని విమర్శించారు. మహిళా MLAను దూషించిన వారిని జగన్ పరామర్శించారు. జగన్ లాంటి నాయకులు మనకు అవసరమా? అని చంద్రబాబు అన్నారు. పేదలకు ఏడాదికి రూ.32,146కోట్ల పెన్షన్లు ఇస్తున్నాం.. ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏమైనా ఉంటుందా? అని అడిగారు. త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచనతోనే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి. రూ.3800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టాం.. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు ఉండదు.. రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. టీడీపీ హయాంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఐటీ డెవలప్‌అయిందని అన్నారు. మొట్ట మొదటగా మైక్రోసాఫ్ట్‌ను తానే తీసుకొచ్చానని తెలిపారు. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ(Microsoft CEO Satya Nadella) అయ్యాడు అంటే నా వల్లే అని సీఎం చంద్రబాబు అన్నారు. వీడియో

Next Story