- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రతిష్టాత్మక దావోస్ పర్యటన నేటితో ముగియనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రతిష్టాత్మక దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరిపిన సీఎం.. నేటి సాయంత్రం జ్యూరిక్ నుంచి బయలుదేరనున్నారు. రేపు (శుక్రవారం) ఆయన అమరావతికి చేరుకోనున్నట్లు అధికారుల సమాచారం.
పెట్టుబడులే ప్రధాన ఎజెండా..
ముఖ్యమంత్రి పర్యటన వివరాలను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలో మీడియాకు వెల్లడించారు. "రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం దావోస్‌లో పర్యటించారు. అక్కడ పెద్ద ఎత్తున అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు," అని మంత్రి తెలిపారు.
ఎల్లుండి నగరి బాట..
విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఎల్లుండి (శనివారం) ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నగరిలో నిర్వహించనున్న ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని, అనంతరం స్థానిక నేతలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More..






