దావోస్‌లో ఆసక్తికర భేటీ: మీటింగ్ రూమ్ కాదు.. ‘లేట్ నైట్ వాక్‌’లో టాటా బాస్‌తో లోకేశ్ చర్చలు!

by Ramesh Naini |   (  Updated:2026-01-22 04:56:53  IST  )

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్.. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో జరిపిన భేటీపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

దావోస్‌లో ఆసక్తికర భేటీ: మీటింగ్ రూమ్ కాదు.. ‘లేట్ నైట్ వాక్‌’లో టాటా బాస్‌తో లోకేశ్ చర్చలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్.. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో జరిపిన భేటీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణంగా కార్పొరేట్ చర్చలు మీటింగ్ రూముల్లో జరుగుతుంటాయి, కానీ లోకేశ్ మాత్రం ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తతో అర్ధరాత్రి వాకింగ్ చేస్తూ కీలక చర్చలు జరిపారు. ఈ ప్రత్యేక సమావేశం గురించి మంత్రి లోకేశ్ గురువారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘దావోస్ చర్చలకు ఎప్పుడూ మీటింగ్ రూములే అవసరం లేదు. నేను ఎంతగానో గౌరవించే కార్పొరేట్ దిగ్గజం, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సార్‌తో లేట్ నైట్ వాకింగ్‌లో చాలా విషయాలు చర్చించాను. ఏపీలో టాటా గ్రూప్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయనకు క్లుప్తంగా వివరించడంతో పాటు, ఆయన నుంచి విలువైన సలహాలు, దిశానిర్దేశం తీసుకున్నాను’ అని పేర్కొన్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ బృందం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో ఏపీ ప్రతినిధి బృందం బిజీబిజీగా గడుపుతోంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్.. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సీఈఓలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే టాటా సన్స్ ఛైర్మన్‌తో లోకేశ్ జరిపిన ఈ 'లేట్ నైట్ వాక్' చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read More..

భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం.. దావోస్ వేదికగా ట్రంప్ కీలక ప్రకటన

Next Story