అవుట్ స్టాండింగ్ విక్టరీ.. ఆసియా కప్ విజయంపై సీఎం చంద్రబాబు అభినందనలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-08 06:36:28  IST  )

8 సంవత్సరాల తర్వాత హాకీలో ఆసియా కప్ గెలిచిన టీమ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

అవుట్ స్టాండింగ్ విక్టరీ.. ఆసియా కప్ విజయంపై సీఎం చంద్రబాబు అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: 8 సంవత్సరాల తర్వాత హాకీలో ఆసియా కప్ (Hockey Asia Cup 2025) గెలిచిన టీమ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. దక్షిణకొరియాపై ఎనిమిదేళ్ల తర్వాత సాధించిన ఈ విజయం.. అవుట్ స్టాండింగ్ విక్టరీగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత క్రీడారంగంలో ఇది గర్వించదగిన మైలురాయిగా నిలుస్తుందన్నారు. యువ అథ్లెట్లు దేశ హాకీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షించారు.

"బిహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఆసియా కప్ 2025లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు. డిఫెండింగ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాపై 4-1 తేడాతో విజయం సాధించి ఎనిమిది సంవత్సరాల తర్వాత మా జట్టు టైటిల్‌ను తిరిగి పొందింది. ఈ విజయం భారత క్రీడలో గర్వించదగ్గ మైలురాయి. భావితరాల యువ అథ్లెట్లకు ధైర్యం, పట్టుదలకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుంది. మన ఆటగాళ్ళు భారతదేశ గొప్ప హాకీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కొనసాగిస్తారని, ప్రపంచ వేదికపై మరిన్ని చిరస్మరణీయ ప్రదర్శనలను చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. 2026లో జరిగే ప్రపంచ కప్‌కు వారికి శుభాకాంక్షలు." అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy)కూడా ఆసియా కప్ గెలిచిన హాకీ టీమ్ కు అభినందనలు తెలిపారు. 8 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించి.. జాతిని గర్వపడేలా చేశారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ విజయం యువ అథ్లెట్లలో స్ఫూర్తిని నింపడంతో పాటు.. చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత హాక జట్టు ప్రపంచ వేదికపై మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి మండిపల్లి ఆకాంక్షించారు.

Next Story