- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు..వారందరికీ డబ్బుల పంపిణీ !
నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు సీఎం చంద్రబాబు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో దూసుకు వెళ్తున్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఏపీ అభివృద్దిలో చూపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రంగాలలో తెలంగాణ లాంటి రాష్ట్రాలను కూడా దాటేసి ఏపీ దూసుకెళ్లింది. అంత డెడికేషన్ తో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. అయితే అలాంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు, కడప జిల్లాలలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
ముందుగా నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు సీఎం చంద్రబాబు. అర్హులందరికీ తన చేతుల మీదుగా ఈ డబ్బులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పాతూరులో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఈ సందర్భంగా కోదండ రామస్వామికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పిస్తారు. తదనంతరం సీతారాముల కళ్యాణం ఉత్సవానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఇందులో నారా భువనేశ్వరి కూడా పాల్గొంటారు. ఇక రాత్రి ఒంటిమిట్టలోనే సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు బస చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.






