కుటుంబ సమేతంగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-24 11:20:38  IST  )

కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు..

కుటుంబ సమేతంగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సైతం హస్తినకు వెళ్తున్నారు. అమరావతి(Amaravati) నుంచి ఢిల్లీ(Delhi)కి చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ(Pm Modi)ని కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. మే 2న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. అదే రోజు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీకి ఢిల్లీలో ఆహ్వానపత్రిక అందించనున్నారు. .అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రధాని మోడీ ఏపీకి వచ్చి తిరిగి వెళ్లే వరకూ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తోంది.

Next Story