ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-17 16:25:02  IST  )

విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Chowdary) ఇటీవలే లండన్‌ (London) పర్యటనలో ప్రమాదవశాత్తు ఆయన జారిపడటంతో కుడి భుజం ఫ్రాక్చర్‌ (Fracture) అయిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Chowdary) ఇటీవలే లండన్‌ (London) పర్యటనలో ప్రమాదవశాత్తు ఆయన జారిపడటంతో కుడి భుజం ఫ్రాక్చర్‌ (Fracture) అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్ (Kim's-Sunshine) ఆసుపత్రిలో సుజనాకు చేసిన సర్జరీ విజయవంతమైంది. మరో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు (CM Chandrababu) పరామర్శించారు. వైద్యులు ఇచ్చిన మెడికేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచి సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లిపోయారు.

Next Story