- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్హా శాంతి వనం సందర్శించిన సీఎం చంద్రబాబు
రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. శాంతి వనాన్ని సందర్శించిన అనంతరం దాజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కన్హా శాంతి వనంలో హార్ట్ ఫుల్నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గురించి చర్చించారు. శాంతి వనంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై దాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ అంశాలను వివరించారు. ఏపీలో హార్ట్ ఫుల్నెస్ కార్యాలయం ఏర్పాటు చేయడంపై దాజీతో సీఎం సమాలోచనలు చేశారు.
కన్హా శాంతివనం విశేషాలు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఈ ఆశ్రమంలో ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షులు దాజీ నేతృత్వంలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది. కౌశలం పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. కన్హా శాంతివనంలోని యోగా, మెడిటేషన్, వెల్ నెస్ సెంటర్లతో పాటు సుస్థిర వ్యవసాయ క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.






