లోక్ భవన్‌కు సీఎం చంద్రబాబు.. గవర్నర్‌కు పరామర్శ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-25 09:07:59  IST  )

స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు....

లోక్ భవన్‌కు సీఎం చంద్రబాబు.. గవర్నర్‌కు పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: స్వల్ప అస్వస్థత కారణంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌(Governor S. Abdul Nazeer) ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయనను తాజాగా సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ మేరకు లోక్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు.. గవర్నర్ తో భేటీ అయి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

ఆకస్మిక అస్వస్థతకు గురైన గవర్నర్

కాగా ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి బాధపడ్డారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్‌కు తరలించారు. నొప్పి తీవ్రత పెరగడంతో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని వైద్యులు తెలిపారు. అయితే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి మణిపాల్ ఆస్పత్రి నుంచి గవర్నర్ విజయవాడ వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్‌ను కలిశారు.

ఏపీలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Next Story