6 ఆరేళ్ల క్రితం ఇదే రోజు విధ్వంసకరం: చంద్రబాబు సంచలన ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-25 13:41:34  IST  )

రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం జరిగిన విధ్వంసకర ఘటనను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు...

6 ఆరేళ్ల క్రితం ఇదే రోజు విధ్వంసకరం:  చంద్రబాబు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎమర్జెన్సీ(Emergency) సమయంలో జరిగిన అత్యవసర పరిస్థితులు, పరిణామాలు, ఘటనపై ‘ది ఎమర్జెన్సీ డైరీస్’(‘The Emergency Diaries’) అనే పేరుతో పుస్తకాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాటి ఎమర్జెన్సీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

‘‘దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయింది. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు తెరలేపింది. అయితే ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదని.. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారు. కూల్చివేతల పాలకులను కూల్చిన ప్రజలు...పునర్మిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారు. అందుకే ఒక కసి, పట్టుదలతో రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్లు అయిన సందర్భంగా నాటి ఘటనను గుర్తు తెచ్చుకుని... మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దాం.’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ట్విట్టర్ ట్వీట్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

Next Story