అన్ని విషయాలు నోట్ చేస్తా: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్

by Vemula.Srinu Prasad |

అన్ని విషయాలు నోట్ చేస్తానని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు...

అన్ని విషయాలు నోట్ చేస్తా: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల(Assembly Sessions) నేపథ్యంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 40 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతానని చెప్పారు. ఆవు కథలు ఇకనైనా మానాలని, అసెంబ్లీకి వచ్చే సమయంలో సబ్జెక్ట్‌పై అవగాహనతో రావాలని సూచించారు. అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యే రావాలని, సమయ పాలన పాటించాలని, సభలో మాట్లాడుతున్న అన్ని విషయాలను తాను నోట్ చేస్తానని తెలిపారు. అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో ఎమ్మెల్యేలు కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం తెలిపారు.

ఎప్పటికప్పుడు వివరించాలి...



రాష్ట్రంలో లబ్ధిదారులకు అందుకున్న సంక్షేమ పథకాలపై ఆయా నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలని, భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బతీయకూడదన్నారు. మతాలపై జగన్‌కు గౌరవ లేదని, అందుకే గత ఐదేళ్లలో రామతీర్థం సహా చాలా చోట్ల ఆలయాలు, దేవుళ్లపై దాడులు జరిగాయన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూనే కాదని, రాష్ట్రంలో ఎక్కవ అవకాశం దొరికిందో అక్కడ కల్తీకి తెగబడ్డారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story