- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు...ఎప్పుడంటే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ (DELHI) పర్యటన

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ (DELHI) పర్యటనకు వెళ్ళనున్నారు. ఈనెల 15 అలాగే 16వ తేదీలలో... అంటే రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లపై కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ తో పాటు తదితరులతో చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. ముఖ్యంగా పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై... కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి కూడా... ఆయా మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని అపాయింట్మెంట్లు.. ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.






