- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: రేపు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశం కానున్నారు....

దిశ, వెబ్ డెస్క్: మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా హాజరుకానున్నారు. జీఎస్డీపీ, 2047 విజన్‌లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, దస్త్రాల పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చంద్రబాబు సమీక్షిస్తారు. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంతో ప్రజల ఆస్తులకు రక్షణ వంటి వాటిపై అధికారులు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. అదే విధంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ పైనా మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నారు. అనంతరం సంక్రాంతి పండుగకు సీఎం చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.






