- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా ‘అన్నమయ్య’ జల సంరక్షణ మోడల్: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచే దిశగా చేపట్టిన ‘జలధార- జలహారతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచే దిశగా చేపట్టిన ‘జలధార- జలహారతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణలో అన్నమయ్య జిల్లా అమలు చేస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ జలధార ప్రాజెక్టుకు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను నోడల్ అధికారిగా సీఎం నియమించారు.
భూగర్భ జలాల పెంపుతో విద్యుత్ భారం తగ్గుతుందని, ఆదా అయిన నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చని సీఎం వివరించారు. జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లోకి నీటిని చేర్చాలని, పట్టణ ప్రాంతాల్లో నోడల్ అధికారులు పనులను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.






