- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM చంద్రబాబు మరో కీలక నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై శుక్రవారం వర్చువల్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: వ్యక్తుల బొమ్మ లేకుండా రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) ఒకరోజు పాల్గొనాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై శుక్రవారం వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూహక్కుపత్రాల్లో మాజీ సీఎం జగన్ ఫొటోను తొలగించి గతంలో మాదిరిగానే ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది. మ్యుటేషన్ పూర్తయిన వారికి ఇవ్వడం ప్రారంభించారు. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలు జిల్లాకు ఇప్పటివరకు 1.50 లక్షలు వచ్చాయి. తప్పులు లేకుండా ఆ వివరాలను వెబ్‌ల్యాండ్‌లో సరిపోల్చుతున్నారు. తొలుత 90 వేల పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు డీఆర్వో సీతారామమూర్తి తెలిపారు.






