ట్యాంక్ బండ్ కంటే గొప్పగా అవిలాల చెరువును అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కంటే బాగా అవిలాల చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే గెలవాలని, కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు.

ట్యాంక్ బండ్ కంటే గొప్పగా అవిలాల చెరువును అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దపండుగైన సంక్రాంతికి అందరూ సొంతూళ్లకు వెళ్లాలని సూచించారు. సొంతూరిలో అయివారందరితో కలిసి పండుగలు జరుపుకుంటే బంధాలు బలపడుతాయని, మనుషుల మధ్య విశ్వాసం పెరుగుతుందని, ఒకరికి సహాయం చేయాలన్న ఆలోచన కూడా వస్తుందని పేర్కొన్నారు. తాము 16 సంవత్సరాలుగా సొంతూరిలో సంక్రాంతి చేసుకుంటున్నామన్నారు.

పీ4 పథకం కింద 10 లక్షల కుటుంబాలు దత్తత

ఇక రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగంగా చేస్తామన్నారు. ఇందులోభాగంగానే స్వర్ణ నారావారిపల్లికి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగిట్లని తెలిపారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన కోసం P4 పేదరిక నిర్మూలన పథకాన్ని, ఈ పథకం కింద 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలో హంద్రీనీవా నీటిని కల్యాణి డ్యామ్ కు తరలిస్తామన్నారు. కుప్పంలో ఇప్పటికే సంజీవని కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు.

2027లో ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఇక రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కంటే బాగా అవిలాల చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే గెలవాలని, కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story