- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎజెండా లీక్ పై అసహనం?
ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మూడు గంటలకు పైగా సాగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై ఆయన మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ భేటీ ప్రారంభమైన ఎజెండా పత్రాలు మంత్రులకు అందలేదని సీఎంకు తెలిపారు. అజెండా ముందే వస్తే.. దానిని స్టడీ చేసుకుని కేబినెట్ కు వచ్చే వీలు ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన సీఎం.. వ్యవస్థలు ఉపయోగపడాల్సింది పోయి.. రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయన్నారు. గతంలో సెక్రటరీలు సందేహాలను తీర్చడంలో చొరవ చూపేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ముందుగానే ఎలా లీకవుతుందని సీఎం మంత్రుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సమాచారం లీకవ్వడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగానే లీకైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. కేబినెట్ సమాచారం లీకైతే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇది మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారు.






