- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో ‘యోగా డే’.. సమీక్ష తర్వాత సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ నెల 21న విశాఖలో యోగా డే నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 21న విశాఖలో యోగా డే(Yoga Day) నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. యోగా డే కార్యక్రమంపై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా డేలో పాల్గొనేందుకు 5 లక్షల మందికి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కేలా ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. 22 అంశాల్లో రికార్డు బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పాల్గొన్న 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా యోగా డే జరుపుకునేలా ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమని, అనుకున్నట్లు యోగాడేను నిర్వహించాలని సూచించారు. యోగాపై ప్రతిఒక్కరిలో అవగాహన తీసుకురావాలని తెలిపారు. దేశం మొత్తం చెప్పుకునేలా ఈ యోగా డేను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యోగా డే స్ఫూర్తిని భావితరాలకు అందజేయాలని సూచించారు. యోగా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి రోజూ కనీసం అరగంట అయినా యోగా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.






