ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని సీఎం చంద్రబాబు అన్నారు..

ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్సులు సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆయన నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పని తీరుపైనా ఈ సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని అధికారులకు సూచించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి, నిరంతరం పర్యవేక్షించాలని తద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్‌లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఈ సందర్భంగా మన మిత్ర - వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్టు, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని సీఎంకు అధికారులు వివరించారు

Next Story