- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో రెండు నదుల అనుసంధానం... సీఎం కీలక ప్రకటన
శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధానిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం(Srikakulam)లో ఉన్న వంశధార(Genealogy)ను, గోదావరి(Godavari), కృష్ణా(Krishna), రాయలసీమ(Rayalaseema)లో పెన్నా నది(Penna River)ని అనుసంధానిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభ(Palanadu-Macharla Prajavedika Sabha)లో పాల్గొన్న ఆయన.. జిల్లాలో తలసరి ఆదాయం తక్కువ ఉందని, అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల, గురజాలను అభివృద్ధి చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికీ కుళాయితో తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పలనాడు జీవనాడి వరికెపుడిశెల ప్రాజెక్టు(Palanadu Lifeline Rice Paddy Project)ను పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. 1.25 లక్ష ఎకరాలకు నీరు అందుతుంది. మరో లక్ష మందికి తాగునీరు అందిస్తామని చెప్పారు. మొదటి దశలో 1.45 టీఎంసీలు, రెండో దశలో 6.3 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి వరం పోలవరం. గతంలో మేం 76 శాతం పూర్తి చేస్తే ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి విధ్వంసం చేశాడని చెప్పారు. ప్రజావేదికతో విధ్వంసం మొదలు పెట్టి పోలవరంలో డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయేలా చేశాడని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం పునర్నిర్మాణం చేపట్టామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు.






