- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati: రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నా ఏపీ-నా రాజధాని అని రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకునేలా అమరావతి పున:నిర్మాణం ఉండబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: నా ఏపీ-నా రాజధాని(Na Ap-Na Rajadhani) అని రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకునేలా అమరావతి(Amaravati) పున:నిర్మాణం ఉండబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. మంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాజధాని అమరావతి ప్రయాణం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకునేలా ప్రజా రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రానికి నవోదయంలా రాజధాని అమరావతి ఉండబోతోందని చెప్పారు. మే 2వ తేదీ ఏపీ చరిత్రలో గొప్ప మలుపుకానుందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్(Jagan) ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని దెబ్బతీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. చాలా సవాళ్లను, కష్టాలను తట్టుకుని అమరావతి నిలబడిందన్నారు. విధ్వంసకారులకు గట్టి సమాధానంగా అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఏపీ రాజధాని నిర్మాణంపై ప్రధాని మోడీ(Pm Modi) సైతం ఆసక్తితో ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.






