త్వరలో బుల్లెట్ ట్రైన్ .. ఈ రూట్లలో మాత్రమే..?

by Vemula.Srinu Prasad |

త్వరలోనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు....

త్వరలో బుల్లెట్ ట్రైన్ .. ఈ రూట్లలో మాత్రమే..?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad)-అమరావతి(Amaravati)- చెన్నై(Chennai)- బెంగళూరు(Bengaluru)ను కలుపుతూ త్వరలోనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు(Bullet train project) వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. హైవేల విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రూ. రెండున్నర లక్షల కోట్ల విలువైన రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు- చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లపై కేంద్రం చర్చిస్తోందని తెలిపారు. రైల్వే డబుల్ లైన్లను నాలుగు వరుసలుగా మార్చే చాన్స్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Next Story