- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. అమరావతి(Amaravati) సచివాలయంలో నిర్వహించిన కేబినెట్(Cabinet) భేటీ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడారు. మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా మార్చుతామని, ఇందుకు కేంద్రం సైతం సహకరిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇక రాజధాని విస్తరణపై ఆయన మాట్లాడుతూ రెండోదశ భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజధానికి భూములు ఇస్తున్నందుకు రైతులు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






