- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్ల వల్లే కాలేదు.. వీళ్లతో అవుతుందా: సీఎం చంద్రబాబు
ఆయుధాలు పట్టిన నక్సలైట్లే గన్ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని, అలాంటిది వీళ్లు గొడ్డళ్లతో రాజకీయాలు చేస్తూ ఎలా నెగ్గుకురాగలరని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు....

దిశ, వెబ్ డెస్క్: ఆయుధాలు పట్టిన నక్సలైట్లే గన్ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని, అలాంటిది వీళ్లు గొడ్డళ్లతో రాజకీయాలు చేస్తూ ఎలా నెగ్గుకురాగలరని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్(Ntr Bhavan)లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హత్య రాజకీయాలు చేసిన వాళ్లు రాష్ట్రాన్ని ఏలవచ్చు కానీ, బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు కూడా చేయకూడదనే విచిత్రమైన సిద్ధాంతాన్ని వైసీపీ వాళ్లు నమ్ముతున్నారని ఆయన విమర్శించారు. నేటి తరం యువతకు కూడా వీరి ఫ్యాక్షనిజం, కుట్రల గురించిన పూర్తి విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సునీత పోరాటంలో న్యాయం ఉంది
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత చేస్తున్న పోరాటంలో పూర్తి న్యాయం ఉందని చంద్రబాబు మద్దతుగా నిలిచారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు కూతురిగా ఆమెకు ఖచ్చితంగా ఉంటుందని, సునీత ఒంటరిగా చేసిన ఈ న్యాయపోరాటం వల్లే నేటికీ ఆ కేసు సజీవంగా ఉందన్నారు. బాధితులకు అండగా ఉంటూ, ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వారిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం అందరి బాధ్యతని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నిజాలు బయటపడే కొద్దీ..
ఆంధ్రప్రదేశ్‌లో 'సైకో' అనే పదం కంటే 'గొడ్డలి పార్టీ' అనే అంశాన్నే ప్రజలు బలంగా గుర్తించారని, ఈ నిజాలు బయటపడే కొద్దీ అవతలి వైపు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబానికి సంబంధించిన కొన్ని అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తుండటం చూసి తానే ఆశ్చర్యపోతున్నానని అన్నారు. మూడు దశాబ్దాల క్రితమే కడప జిల్లాలోని పాలెగాళ్ల రాజ్యంపై వచ్చిన పుస్తకాన్ని ఇప్పుడు సమాజం మొత్తం చదువుతోందని, ఇలాంటి హింసాత్మక ప్రవృత్తి గలవారు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం పనికిరారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.






