తెలంగాణ సమ్మిట్‌కు శరవేగంగా ఏర్పాట్లు.. వెళ్లడంపై ఇంకా నిర్ణయం తీసుకోని సీఎం

by Vemula.Srinu Prasad |

తెలంగాణ సమ్మిట్‌కు వెళ్లడంపై నిర్ణయం తీసుకోలేదని సీఎం చంద్రబాబు తెలిపారు..

తెలంగాణ సమ్మిట్‌కు శరవేగంగా ఏర్పాట్లు.. వెళ్లడంపై ఇంకా నిర్ణయం తీసుకోని సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్(Telangana Rising Global Summit) నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8,9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీ(Future City)లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు ఏర్పాటు చేయనుంది. ఈ సదస్సుకు రావాలని దేశ, విదేశాల దిగ్గజ పారిశ్రామికవేత్తలతో పాటు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. ఏపీ(Ap), తమిళనాడు(Tamilanadu) ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), స్టాలన్‌(Stalin)ను సైతం ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రావాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Minsiter KomatiReddy VenkatReddy) ఆహ్వానించారు.

అయితే ఈ ఆహ్వానంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతి సచివాలయంలో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ సమ్మిట్‌కు వెళ్లడంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. వివేకా కేసు చిన్నదయినప్పుడు పరకామణి కేసు పెద్దదవుతుందా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story