రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులు.. సీఎ చంద్రబాబు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

వచ్చే ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 1 లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు....

రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులు.. సీఎ చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం(Food processing sector)లో 1 లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Food processing sector) తెలిపారు. విశాఖ(Visakha)లో జరిగిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 175 నియోజక వర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నానమని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. అగ్రిటెక్ రంగం(Agritech sector)లో బిల్ గేట్స్ ఫౌండేషన్‌(Bill Gates Foundation)తో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ట్రేసబిలిటి, సర్టిఫికేషన్లకు, ప్రాడెక్టు పర్ఫెక్షన్‌కు ఏపీ అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది ఇప్పుడు ప్రధాన సవాలుగా ఉందని, దీనిపై కూడా ఏపీ పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తున్నాం. రూ. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలకు కూడా పెద్ద పీట వేసేందుకు ఏపీ సిద్ధం. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో గతేడాదిగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులకు ఇదే మంచి సమయం, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. రిస్క్ లయబిలిటీ చాలా తక్కువగా ఉంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. వ్యవసాయాన్ని లాభదాయకంగా - సుస్థిరంగా మార్చటమే నా లక్ష్యం. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సంతోషదాయకం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story