- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని అభివృద్ధిపై ‘రైసినా డైలాగ్’లో సీఎం కీలక వ్యాఖ్యలు
భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకు వెళ్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘రైసినా డైలాగ్’లో ఆయన పాల్గొన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat) శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకు వెళ్తోందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘రైసినా డైలాగ్’(Raisina Dialogue)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నిపుణులను అందించిందని ఆయన గుర్తు చేశారు. నాలెడ్జి ఎకానమీలో లీడింగ్ భాగస్వామిగా భారత్ ఉందని వెల్లడించారు. 60 శాతం జీసీసీలు భారత్‌లో ఏర్పాటు అయ్యాయని స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్నారు. గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకునేలా అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని తెలిపారు. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఐటీ విప్లవం అందిపుచ్చుకున్నప్పుడు అంతా విమర్శించారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారిందన్నారు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని చంద్రబాబు జోస్యం చెప్పారు.
ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుందని చంద్రబాబు తెలిపారు. సైబరాబాద్‌తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీని, ఇన్ ఫ్రాను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారని, అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సహనం అనే పునాదులపై భారతీయ సంప్రదాయ మూలాలు ఉన్నాయని, సహకార ఫెడరలిజం అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాలు పనిచేస్తున్నాయన్నారు. వివిధ రకాల సంస్కరణల ద్వారా వచ్చిన వివిధ పాలసీలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తాయని చెప్పారు. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
‘రైసినా డైలాగ్’లో చంద్రబాబు ప్రసంగించిన వీడియో






