- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
200 టీఎంసీలే వాడుకోగలం: బనకచర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు
రాష్ట్రానికి బనకచర్ల గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి బనకచర్ల(Banakacharla) గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోదావరి నీళ్లు ఏపీ, తెలంగాణ వాడుకోవచ్చని చెప్పారు. 3 వేల TMCల గోదావరినీళ్లు సముద్రంలోకి పోతున్నాయన్నారు. ఎంత వాడుకున్నా ఏపీ 200 టీఎంసీలు.. తెలంగాణ 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని చెప్పారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం(Polavaram) పూర్తి చేస్తామన్నారు. పోలవరానికి కేంద్రం రూ.12వేల 500 కోట్లు ఇచ్చిందని, కేంద్రం సహకారంతో అమరావతికి రూ.15వేల కోట్లు వచ్చాయన్నారు. పోలవరం ద్వారా ఈ ఏడాదిలోనే అనకాపల్లికి నీళ్లిస్తామని చెప్పారు. మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖ మెట్రో పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ పనులు కూడా పూర్తవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.






