Cm Chandrabau: ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ ఏపీదే

by Vemula.Srinu Prasad |

ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ ఏపీదేనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

Cm Chandrabau: ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ ఏపీదే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే మెరుగైన రోడ్ల వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari)తో కలిసి రాష్ట్రంలోని జాతీయ రహదారుల(National Highway)కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. నితిన్ గడ్కరీ హయాంలో చాలా హైవే రోడ్లతో పాటు అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేశారని కొనియాడారు. ముంబై-పుణె మధ్య తొలి పీపీపీ మోడల్ రోడ్డును నిర్మించారని తెలిపారు. దేశంలో రోడ్ల అవసరంపై గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయికి వివరించానని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి, నాగరికతకు రోడ్లు చిహ్నమని చెప్పారు. గడ్కరీ చొరవచూపడం వల్ల రాష్ట్రంలో కిలో మీటర్ల పొడవైన హైవే రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. ఎప్పటికీ మర్చిపోని విధంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అండదండలు అందించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story