భారత్ వృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

భారత్ వృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఆంధ్రప్రదేశ్ ఉండనుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు....

భారత్ వృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ వృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఆంధ్రప్రదేశ్ ఉండనుందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. నీతి ఆయోగ్(Niti Aayog) సమావేశం అనంతరం ప్రధాని మోడీ(Pm Modi) అధ్యక్షతన జరిగిన ఎన్టీయే కూటమి రాష్ట్రల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. 2047-వికసిత్ భారత్(2047-Vikasith India) లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రాష్ట్రాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. I.M.F డేటా మేరకు భారతదేశం 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచంలోనే దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story