మా రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్స్ వేయండి: కేంద్రమంత్రి ఎదుట సీఎం కీలక ప్రతిపాదన

by Vemula.Srinu Prasad |

అమరావతికి బుల్లెట్ ట్రైన్స్ కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.

మా రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్స్ వేయండి: కేంద్రమంత్రి ఎదుట సీఎం కీలక ప్రతిపాదన
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)కి బుల్లెట్ ట్రైన్స్(Bullet trains) కావాలని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరును కలుపుతూ ఉండాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. ఈ రూట్ లో బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తే 4 కోట్ల మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి రాష్ట్రంలో జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు.


మోడీ ముందు చూపు వల్లే మౌలిక వసతులు సమకూరుతున్నాయని చంద్రబాబు అన్నారు. మోడీ ఆలోచనకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముందుకు తీసుకెళ్లున్నారని తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రాష్ట్రంలో ఎలాంటి భూసేకరణ సమస్యలు ఉండవన్నారు. కేంద్రం ఆదేశిస్తే త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని రూ. 85 వేల కోట్ల విలువైన రహదారులు అడిగామని, లక్ష కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు హామీ ఇచ్చారని తెలిపారు. రూ. 27 వేల కోట్ల విలువైన 6 కొత్త ప్రాజెక్టులను రాష్ట్రానికి ఇచ్చారని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story