అమరావతిలో పొట్టి శ్రీరాములు సృతివనం.. 6.8 ఎకరాలు కేటాయింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-15 14:37:52  IST  )

అమరావతిలో పొట్టి శ్రీరాములు సృతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాలు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు...

అమరావతిలో పొట్టి శ్రీరాములు సృతివనం.. 6.8 ఎకరాలు కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో పొట్టి శ్రీరాములు స్మృతివనం(Potti Sriramulu Memorial Park) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. అంతేకాదు ఈ స్మృతివనం కోసం 6.8 ఎకరాలు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మర్పణ సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తికాదని, తెలుగు ప్రజల ఆస్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేయడమే కాకుండా ప్రాణ త్యాగం కూడా చేశారని గుర్తుచేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే తెలుగువాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. 1952లో మద్రాసు బలసుసాంబమూర్తి ఇంట్లో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేపట్టారని, 58 రోజుల తర్వాత ప్రాణ త్యాగం చేశారని చంద్రబాబు తెలిపారు.

Next Story